రేషన్‌ కార్డు ఇవ్వడం లేదు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డు ఇవ్వడం లేదు

Sep 29 2026 12:45 AM | Updated on Sep 29 2026 12:45 AM

నాకు పెళ్లయి నాలుగేళ్లయ్యింది. ప్రభుత్వం నుంచి ఏ పథకాలూ అందడం లేదు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే రేషన్‌ కార్డు కావాలంటున్నారు. రేషన్‌ కార్డు కోసం ఇప్పటికే పలుసార్లు దరఖాస్తు చేశాను. అయినప్పటికీ స్థానిక సచివాలయ సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాను.

– పి.వేణి, జగన్నాథపురం, కాకినాడ

కౌలుకిస్తే భూమి ఆక్రమించుకున్నాడు

మా గ్రామంలో ఉన్న 8 సెంట్ల భూమిలో ఉన్న కొబ్బరి తోటను ఓ వ్యక్తికి కౌలుకు ఇచ్చాను. ప్రస్తుతం ఆ వ్యక్తి రాజకీయ అండతో నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు. రెండేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ఆ భూమి తనకు అమ్మేశారంటూ దొంగ పత్రాలు సృష్టిస్తున్నాడు. శిస్తు డబ్బులు ఇవ్వడం లేదు. నా భూమి కూడా నాకు ఇవ్వడం లేదు. సంవత్సర కాలంగా ఈ సమస్యపై తిరుగుతున్నాను. పెద్దాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

– కుంచే వీర వెంకట సత్యనారాయణమ్మ,

తిరుపతి, పెద్దాపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement