మంగళవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 29 2026 12:45 AM | Updated on Sep 29 2026 12:45 AM

పవన్‌కు చెప్పుకొందామని వెళ్తే.. పోలీసులు తన్ని తరిమేశారు

రావులపాలెం నుంచి ఒక్కో ప్యాకెట్‌ రూ.వెయ్యికి కొని తెచ్చి మిరప నాట్లు వేశాను. నీరు లేక కిలోమీటరు దూరం నుంచి కావిళ్లతో నీరు తెచ్చి, పోసి పంట పెంచాను. ఆరెకరాల్లో టమాటా, మిరప, పత్తి నాటాను. మొక్క దశలో ఉన్న టమాటా తోట ఈ వర్షాలు, వరదలకు పూర్తిగా నానిపోయి పోయింది. మిరప, పత్తి చేలు కోత దశలో ఉండగా దెబ్బ తినడం చూసి తట్టుకోలేక పోతున్నాను. అప్పులు చేసి, పెట్టుబడి పెట్టి, సాగు చేసిన పంటలు పోతే ప్రాణం పోయినట్టుగా ఉంది. ఎవరైనా వస్తారని, మా బాధలు చూస్తారని పొలం దగ్గరే ఉండి మూడు రోజులుగా చూస్తున్నాం. ఎవ్వరూ రావడం లేదు. ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ మొన్న మా ఊరు వచ్చారు. అప్పుడు మా బాధలు చెప్పుకొందామని వెళ్తే పోలీసులు తన్ని తరిమేశారు. ఇక మా బాధలు ఎవరు వింటారు? ఆత్మహత్యలు చేసుకునే దీనస్థితికి అన్నదాతలను నెట్టేయడమేనా పవన్‌ చేసే అభివృద్ధి? ఇప్పటికై నా అన్నదాతను ఆదుకోండి.

– ఓరుగంటి వెంకట సత్యనారాయణ, బంతి, కాలీఫ్లవర్‌ రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం

నరకంలా ఉంది

గత ఏడాది పంట పోయింది. కంటితుడుపుగా రాసుకుని వెళ్లారు తప్ప ఎటువంటి నష్టపరిహారమూ ఇవ్వలేదు. ఈ ఏడాది గంపెడాశలతో ఎన్నో కష్టాలు పడి, అప్పులు చేసి, ఎకరం రూ.30 వేలకు కౌలుకు తీసుకుని, రెండెకరాల్లో మరో రూ.50 వేలు పెట్టుబడి పెట్టి మిరప, పత్తి సాగు చేశాను. వర్షాభావ పరిస్థితుల్లో అదనపు పెట్టుబడి పెట్టి, బోర్లతో నీరందించి మరీ మొక్కలను బతికించుకున్నాం. పైనుంచి వరద నీరు వచ్చి పంటలను పూర్తిగా నాశనం చేసింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. పోయిన పంటలు తీయడానికి తిరిగి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఏమీ చేసే అవకాశం లేకపోవడంతో నాటిన చేతులతోనే ఆ మొక్కలు పీకేయాల్సి రావడం ప్రత్యక్ష నరకంలా ఉంది. ఏ అధికారీ, రాజకీయ నాయకుడూ మా వంక కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏడుపు తప్ప ఏమీ చేయలేని దీనావస్థలో ఉన్నాం.

– ఉలవకాయల గణేష్‌, మిర్చి, పత్తి రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement