నా కొడుకు పెన్నాడి నవీన్ 2024 నవంబర్ 30వ తేదీన హత్యకు గురయ్యాడు. నా కొడుకు చనిపోయాడనే బాధలో ఉండి అప్పట్లో అతడి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఈ ఏడాది ఏప్రిల్‌లో నవీన్ డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే వీఆర్‌ఓ డబ్బులు డిమాండ్ చేశారు. రూ.21 వేలు ఇచ్చాను. అయినప్పటికీ చనిపోయింది మా అబ్బాయి అయితే, అమ్మాయి అని పేర్కొంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. అందులో సవరణ చేయాలని కోరితే మళ్లీ రూ.35 వేలు ఖర్చవుతుందని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఆర్‌డీఓకు కూడా డబ్బులివ్వాలని, లేకుంటే సర్టిఫికెట్ రాదని అంటున్నారు. నాకు భర్త లేడు. కుమారుడు చనిపోయాడు. నేను ఒక్కదాన్నే కూలి పని చేసుకుని బతుకుతున్నాను. అటువంటి నాకు అధికారులు అడిగినంత డబ్బులు ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వద్దకు రెండుసార్లు వెళ్లాను. ఆయన కూడా నాకు న్యాయం చేయలేదు. నా సమస్యపై కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించాను.
– పెన్నాడి విజయ, కాకినాడ


