తాళ్లరేవు: కోరంగిలోని డివైన్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన వ్యాన్‌ను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 30న మెండా వెంకటేశ్వరరావుకు చెందిన బొలేరో వాహనం అపహరణకు గురైంది. ఈ నెల 8న కోరంగి వంతెన వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆ వాహనాన్ని పోలీసులు గుర్తించి, అందులోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పెద బొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పాలెపు సతీష్ ఆ వాహనాన్ని అపహరించినట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచి, రిమాండుకు తరలించారు.


