రాయవరం: ఆధునిక, లగ్జరీ కార్లకు సన్‌రూఫ్ ఉండాలని పిల్లల నుంచి పెద్దల వరకూ కోరుకుంటున్నారు. కారులో వెళ్తున్నప్పుడు సరదాగా సన్‌రూఫ్ తెరచి.. గాల్లో తేలినట్టు ఆనందంగా ప్రయాణించడాన్ని పలువురు ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ ఆనందం మాటున ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందువలన సన్‌రూఫ్ తెరచి ప్రయాణించే వారు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు, రవాణా అధికారులు సూచిస్తున్నారు.
అజాగ్రత్తగా ఉండే ప్రమాదమే..
u సన్‌రూఫ్‌లలో ప్రయాణం కొన్నిసార్లు
ప్రాణాంతకమవుతుంది.
u ఇరుకు, రద్దీ రోడ్లలో ఓవర్ లోడుతో ఎత్తయిన వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఓవర్ హెడ్ బారికేడ్లు ఏర్పాటు చేస్తూంటారు. ఇలాంటి రహదారుల్లో సన్‌రూఫ్‌లో నిలబడి ప్రయాణించకూడదు. అలాగే, విద్యుత్ వైర్లు, టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు, ఇతరత్రా సన్నని తీగలు, చెట్ల కొమ్మలు రోడ్లపై వేలాడుతూంటాయి. ఇటువంటి వాటిని డ్రైవర్లు సాధారణంగా ఒక్కోసారి గమనించలేరు. దీంతో, సన్‌రూఫ్‌లో ప్రయాణించే వారికి ఇవి తగిలి మెడ, తల, మొండెం భాగాలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది.
u అలాగే, నడుం భాగం వరకూ బయట పెట్టి చేతులు ఊపుతూ ప్రయాణిస్తున్న క్రమంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే సన్‌రూఫ్‌లో ఉన్నవారికి పట్టు దొరకదు. దీంతో, సన్‌రూఫ్ ఫ్రేమ్ తగిలి పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. పొత్తి కడుపులో బలంగా తగిలితే తీవ్ర రక్తస్రావం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
u వంకలు, మూల వంపులు అధికంగా ఉన్న రోడ్లలో అయితే, ఏకంగా కారులో నుంచి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
u ఇతర వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము, ధూళి నేరుగా శ్వాస వ్యవస్థలోకి చేరి రోగాలకు కారణమవుతాయి.
స్కూటర్ డిక్కీలో డబ్బులు మాయం
ఫ కారు సన్‌రూఫ్‌లతో జాగ్రత్త
ఫ అప్రమత్తత లోపిస్తే ప్రాణాలకే
ప్రమాదం
ఫ వేలాడే వైర్లు, ఓవర్‌హెడ్
బారికేడ్లతో ముప్పు
జాగ్రత్తలు తీసుకోవాలి
వేగంగా ప్రయాణించే సందర్భంలో సడన్ బ్రేక్ వేస్తే సన్‌రూఫ్ నుంచి కిందకు పడే అవకాశం ఉంటుంది. సన్‌రూఫ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
–బి.విద్య, ఈస్ట్‌జోన్ డీఎస్పీ, రాజమహేంద్రవరం
ప్రమాదకరం
సన్‌రూఫ్ తెరచుకుని చిన్నారులతో ప్రయాణించడం శ్రేయస్క రం కాదు. ఈ విషయంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. సెల్ఫీ లు, ఫొటోలు కారు పూర్తిగా ఆగిన తర్వాత తీసుకుంటేనే మంచిది.
–ఆర్.సురేష్, తూర్పు గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారి
సన్‌రూఫ్ ఎందుకంటే..
ఫ సహజమైన గాలి ప్రసరణ (వెంటిలేషన్) కోసం సన్‌రూఫ్ ఏర్పాటు చేస్తారు.
ఫ అత్యవసర పరిస్థితుల్లో కారు డోర్లు లాక్ అయిపోతే సన్‌రూఫ్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.
ఫ వేసవిలో ఎండలో నిలిపి ఉంచినప్పుడు కారు క్యాబిన్ చాలా వేడెక్కిపోతుంది. అటువంటి సమయంలో ఏసీ ఆన్ చేసి, సన్‌రూఫ్ తెరిస్తే కారులోని వేడి గాలి బయటకు వెళ్లి, కారు క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది.


