కొత్తపేట: అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన ఉండ్రాజపు విలియం కేరీని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన ఘనంగా సత్కరించారు. ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన కేరీ గత నెల 24 నుంచి 27వ తేదీ వరకూ భూటాన్‌లో జరిగిన అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీలో భారత్ జట్టు భూటాన్‌పై విజయం సాధించింది. భారత్ జట్టులో ప్రతిభ చూపి, విజేతగా నిలిచిన విలియం కేరీని రావులపాలెం సీఆర్‌సీలో మంగళవారం జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జగ్గిరెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు ఘనంగా సత్కరించారు. అతడి తల్లిదండ్రులు రాజామణి, సుందర విజయంలను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.


