కాకినాడ రూరల్: మండలంలోని వాకలపూడి గ్రామ పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఆదివారం సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితా వార్డుల వారీగా విభజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితా తయారీపై అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, ఎంపీడీఓ పి.సతీష్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీరామాంజనేయులు పాల్గొన్నారు.


