కాకినాడ క్రైం: జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అరాచకాలకు పాల్పడినా, బెదిరింపులు, సెటిల్‌మెంట్లకు దిగినా చట్టప్రకారం చర్యలు చేపడతామని పోలీసు అధికారులు హెచ్చరించారు. కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలని ఆకాంక్షించారు. కాకినాడ వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు, టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు, పెద్దాపురం ఎస్సై పాపారావు, పెదపూడి ఎస్సై బుజ్జిబాబు, తిమ్మాపురం ఎస్సై గణేష్‌కుమార్ సహా పలు స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు కౌన్సెలింగ్ నిర్వహించారు.
కొనసాగిన జూడాల నిరసన
కాకినాడ క్రైం: స్థానికంగా జూనియర్ వైద్యుల నిరసన 12వ రోజు కొనసాగింది. ఆదివారం కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న పీజీ వసతి గృహం ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. 65 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంచాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎండీ, ఎంఎస్ చదివిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.


