అల్లవరం: తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన అమరావతి చాంపియన్‌షిప్ అండర్–17 విభాగం రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో దేవగుప్తం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి తాడి ఆర్య ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. రెండో స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అతడి తండ్రి ఏడుకొండలు గురువారం తెలిపారు. 60 కేజీల విభాగంలో ఓవరాల్‌గా 137 కేజీల బరువు ఎత్తి అతడు రజత పతకం సాధించాడు. ఆర్యను ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలస్వామి, పీడీ రాజ్‌కుమార్. ఉపాధ్యాయులు అభినందించారు.


