రిమాండ్‌ ఖైదీ పరారీ | - | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ ఖైదీ పరారీ

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

కాకినాడ క్రైం / తుని రూరల్‌: తుని సబ్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పోక్సో నిందితు డు పోలీసుల కళ్లుగప్పి పరా రయ్యాడు. పోలీసుల కథ నం ప్రకారం. తుని రూరల్‌ కేఓ మల్లవరం గ్రామానికి చెందిన 23 ఏళ్ల అడిగెళ్ల భానుప్రకాష్‌ కొద్దిరోజుల క్రితం పోక్సో కేసులో అరెస్టయ్యి తుని సబ్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. కోర్టు ఆదేశాల మేరకు భానుప్రకాష్‌ను ఎస్కార్ట్‌తో కాకినాడ జీజీహెచ్‌కు సామర్థ్య పరీక్ష కోసం శనివారం పంపారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఎం–4 వార్డులో ఉంచారు. అ దే సమయంలో ముద్దాయి భార్య, కుమారుడు అ క్కడికి వచ్చారు. తన కుమారుడిని ఎత్తుకుంటాన ని కోరగా ఎస్కార్ట్‌ కానిస్టేబుల్‌ బేడీలు తొలగించారు. ఇదే అదునుగా ఒక్కసారిగా ఖైదీ పరుగు అందుకున్నాడు. ఆగమేఘాలపై మెడికల్‌ వార్డు నుంచి బయటకు వచ్చి, జన్మభూమి సత్రం మీదు గా ఆసుపత్రి వెనుక గోడ దూకి పరారయ్యాడు. ఎవరికై నా ముద్దాయి సమాచారం తెలిస్తే వెంటనే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ 94407 96531, రూరల్‌ ఎస్సై 94407 96573 ఫోన్‌ నంబర్లకు తెలిపారు.

కొనసాగుతున్న జూడాల నిరసన

కాకినాడ క్రైం: కాకినాడలో జూనియర్‌ డాక్టర్ల నిరసన పదకొండో రోజుకు చేరింది. అత్యవసర వైద్య సేవలను బహిష్కరించిన జూడాలు శనివారం రిలే నిరాహార దీక్షలు, ఫ్లాష్‌ మార్చ్‌ నిర్వహించారు. స్టైఫండ్‌ 15–30 శాతం మేర పెంచాలని, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎండీ, ఎంఎస్‌ చదివిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని, 65 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ వయసును పెంచడం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సాయంత్రం నిర్వహించిన ఫ్లాష్‌మార్చ్‌ పీఆర్‌ కళాశాల, డీఎంహెచ్‌ఓ కార్యాలయం, జిల్లా పరిషత్‌ జంక్షన్‌ మీదుగా జీజీహెచ్‌ తల్లి పిల్లల విభాగం వరకు కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement