అయ్యోరు చెప్పారని మళ్లీ మనువు! | - | Sakshi
Sakshi News home page

అయ్యోరు చెప్పారని మళ్లీ మనువు!

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

అన్నవరం: మీ జీవిత భాగస్వామిని మళ్లీ మనువాడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని జ్యోతిష్యుడు చెప్పడంతో తొమ్మిది జంటలు సత్యదేవుని సాక్షిగా మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం, ఆనందపురాలకు చెందిన ఆ జంటలు వారి జ్యోతిష్యుడు కూర్మేశ్వరరావు సూచన మేరకు బుధవారం ఉదయం 9–30 గంటలకు రత్నగిరిపై ఒకటయ్యారు. అనుకున్న పనులు కావడం లేదని, ఏవేవో వారి సమస్యలు ఆయనకు చెప్పడంతో వారి ఇళ్ల వాస్తులను, జాతకాలను పరిశీలించి మీకు సరైన ముహూర్తాల్లో వివాహాలు జరగకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని, మంచి ముహూర్తంలో మళ్లీ మీ భాగస్వాములను వివాహమాడితే సమస్యలు తొలగుతాయని సెలవిచ్చారు. దీంతో ఆయన సలహా మేరకు వారంతా స్వామివారి సన్నిధిలో ఒకటయ్యారు.

జ్యోతిష్కుని సలహా మేరకే

మాది ఆనందపురం. కొంత కాలంగా మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దీనిపై జ్యోతిష్కుడు కూర్మేశ్వరరావును సంప్రదించాం. మా జాతకాలు, వాస్తు చూసి ఆయన ఇచ్చిన సలహాతో ఇలా స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకున్నాం.

– సత్తిబాబు, లక్ష్మి

సత్యదేవుని సన్నిధిలో పునఃవివాహం

చేసుకున్న తొమ్మిది జంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement