సామర్లకోట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక అన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పాదయాత్రల ముగింపు సందర్భంగా స్థానిక నీలమ్మ చెరువు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక పాదయాత్రను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ మతోన్మాధ విధానాలతో దేశం ప్రమాద స్థితిలోకి చేరిందని హెచ్చరించారు. దేశ సమైకత్య సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 6 నుంచి 14 వరకు ప్రజల కోసం, ప్రజలతో కలిసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా సెప్టెంబరు 1న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శులు కె.బోడకొండ, తోకల ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ నుంచి అమలాపురం వరకు ఉన్న గ్యాస్ నిక్షేపాలను పైపులైన్ ద్వారా మహారాష్ట్ర, గుజరాత్‌కు తరలిస్తున్నారన్నారు. స్థానికంగా లభించే గ్యాస్, పెట్రోలు నిక్షేపాలను స్థానికంగా అందజేస్తే గ్యాస్ సిలిండరు రూ.100కే వస్తుందన్నారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మధు


