రేపటి నుంచి సత్యదేవుని జయంత్యుత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సత్యదేవుని జయంత్యుత్సవాలు

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామివారి జయంత్యుత్సవాలకు దేవస్థానం ముస్తాబైంది. గురువారం నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొలిరోజు ఉదయం 8.30 గంటలకు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో వేడుకలు మొదలవుతాయి. ఈసారి సత్యదేవుని జన్మ నక్షత్రం ‘మఖ’ కూడా స్వామివారి జయంత్యుత్సవం నాడు రావడం విశేషం. శుక్రవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవార్లకు, శివలింగానికి పంచామృతాలతో మహాన్యాశపూర్వక అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు జపతపాలు, పారాయణలు, మూల మంత్రజపాలు నిర్వహిస్తారు. సత్యదేవుని జయంత్యోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 20 మంది పండితులను ఘనంగా సత్కరించనున్నారు. కాగా.. స్వామివారి ఆలయం, రాజగోపురాలు, రామాలయం, ఆలయ ప్రాంగణాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రత్నగిరిపై తూర్పు, పశ్చి మ రాజగోపురాలు రంగురంగుల విద్యుత్‌ దీపాల తో శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement