మెగా దగాపై మహోద్యమం | - | Sakshi
Sakshi News home page

మెగా దగాపై మహోద్యమం

Aug 11 2026 12:18 AM | Updated on Aug 11 2026 12:18 AM

తునిలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, పార్టీ శ్రేణులు

డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ, నిరుద్యోగులకు అండగా వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ర్యాలీ విజయవంతమైంది. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఖండిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో పాటు యువత, నిరుద్యోగులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ర్యాలీకి అనుమతులు లేవంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించినా, వాటిని దాటుకుని కదం తొక్కారు. అక్రమాలపై గర్జిస్తూ, అర్హులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మెగా డీఎస్సీ పేరుతో కూటమి చేసిన దగాపై ఉద్యమించారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: డీఎస్సీలో అక్రమాలపై ఉద్యమిస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, యువత, అభ్యర్థులకు కూటమి ప్రభుత్వ నేతృత్వంలోని పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు కుయుక్తులు పన్నారు. ర్యాలీలో పాల్గొన వద్దంటూ ముందస్తుగా నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురి చేశారు. వాటన్నింటినీ లెక్క చేయని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఉద్యమ కెరటాలై ఉద్యమించారు. చంద్రబాబు ప్రభుత్వ పిరికిపంద చర్యను వ్యతిరేకించారు. భారీ బైక్‌ ర్యాలీలతో ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించారు. ప్లకార్డులు చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలకు మంత్రి నారా లోకేశ్‌ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. నిర్వహణపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఫ డీఎస్సీ అక్రమాలపై

కదం తొక్కిన వైఎస్సార్‌ సీపీ

ఫ బాధితులకు అండగా జిల్లాలో ర్యాలీలు

ఫ తరలివచ్చిన బాధితులు, యువత

ఫ అణచి వేసేందుకు పోలీసుల కుయుక్తులు

ఫ ర్యాలీలో పాల్గొనవద్దంటూ నోటీసులు

ఫ లెక్కచేయకుండా ముందుకు

సాగిన పార్టీ శ్రేణులు, యువత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement