సీబీఐ విచారణ చేపట్టాలి
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ స్థానిక ఆనంద భారతి గ్రౌండ్స్ నుంచి వైఎస్సార్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు జరగలేదని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా విభజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, అధిక సంఖ్యలో యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
మండుటెండలో కదం తొక్కి..
డీఎస్సీలో అర్హులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం ఆగదని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరిన వైఎస్సార్ సీపీ శ్రేణులు రాజుగారికోట నుంచి ఉప్పాడ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్ సెంటర్‌కు చేరుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. వంగా గీత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. దీనిపై సీబీఐ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
డీఎస్సీ అక్రమాలపై పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవలూరి దొరబాబు ఆధ్వర్యంలో మెహర్ కాంప్లెక్స్ నుంచి స్థానిక రైల్వే స్టేషన్‌లో సెంటర్ ర్యాలీ వరకు సాగింది. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా వేల మంది తరలిరావడంతో మిన్నకుండిపోయారు. ఈ సందర్భంగా నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన సాగింది. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్‌లో యువతను ఉద్దేశించి దొరబాబు, నియోజకవర్గ పరిశీలకుడు నక్క నగేష్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం యువతను మోసం చేసిందని, వారికి అండగా ఉండేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాకినాడ సిటీ
పిఠాపురం


