జగ్గంపేట | - | Sakshi
Sakshi News home page

జగ్గంపేట

Aug 11 2026 12:18 AM | Updated on Aug 11 2026 12:18 AM

u

దగా డీఎస్సీ

చంద్రబాబు ప్రభుత్వం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వహించింది దగా డీఎస్సీ అని మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తోట నరసింహం అన్నారు. జగ్గంపేటలో ఆయన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల మీదుగా మెయిన్‌ రోడ్డు వరకు సాగిన ర్యాలీలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బైక్‌ ర్యాలీతో హోరెత్తించారు. తోట నరసింహం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తోందన్నారు. డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలను కట్టబెట్టి, అర్హులకు అన్యాయం చేసిందన్నారు. ఈ అక్రమాలకు మంత్రి లోకేశ్‌ నైతిక బాధ్యత వహించి, రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం, నాయకులు పాల్గొన్నారు.

జగ్గంపేటలో మాట్లాడుతున్న కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి తోట నరసింహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement