అర్జీలు ఇస్తున్నా.. పరిష్కారం సున్నా | - | Sakshi
Sakshi News home page

అర్జీలు ఇస్తున్నా.. పరిష్కారం సున్నా

Aug 11 2026 12:18 AM | Updated on Aug 11 2026 12:18 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సమస్య చిన్నదైనా దానికి పరిష్కారం మాత్రం లభించడం లేదని, పదే పదే అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వస్తున్న ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రాల్లో తమ గోడు పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్రానికి వస్తున్నామని, ఇక్కడ కూడా ఇదే వంతు జరుగుతోందని వాపోతున్నారు. కాగా.. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 310 అర్జీలు సమర్పించారు. తాగునీటి కుళాయి ఇవ్వడం లేదని, పింఛన్‌ మంజూరు చేయడం లేదని, రైతు భరోసా నిధులు జమ కావడం లేదని, రీ సర్వేలో భూమి తక్కువగా నమోదయ్యిందటూ ఫిర్యాదులు చేశారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ చిన్న సమస్యకూ లభించని పరిష్కారం

ఫ పీజీఆర్‌ఎస్‌ ప్రజల పెదవి విరుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement