పెనుగుదురులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కన్నబాబు
కాకినాడ రూరల్ నియోజవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేల మంది ద్విచక్ర వాహనాలతో కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని డి మార్ట్ సెంటర్‌కు చేరుకున్నారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారు. అంతకు ముందు కన్నబాబుకు నోటీసులు అందజేశారు. పోలీసుల నుంచి ఆయన తప్పించుకుని డి మార్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభించారు. తూరంగి, నడకుదురు, పెనుగుదురు గ్రామాల మీదుగా కరపలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రడ్డి విగ్రహం వరకు ఏడు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ సాగింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, నిరు ద్యోగ భృతి చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. కన్నబాబు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అంతులేని అవినీతికి పాల్పడ్డారన్నారు.


