దాతలే దేవుళ్‌లై నడిపిస్తున్న సంకల్పం ఇది. ఆరేళ్లుగా వారి అండతోనే తండ్రిని కోల్పోయిన పిల్లల చదువులకు ఫీజులు చెల్లించగలుగుతున్నాం. ప్రముఖులు, వ్యాపారులు, అధికారులు, ఇతర వర్గాలు భాగస్వాములు అవుతున్నారు. సాయం పొంది స్థిరపడి మళ్లీ మా వద్దకు వచ్చి, తమ లాంటి పిల్లలను చదివించండని సహాయం అందించడం చూస్తే ఎంతో గర్వంగా ఉంది. తండ్రిని కోల్పోయిన ఏ విద్యార్థి చదువుకు ఆటంకం కలగకుండా ఉద్యోగంలో చేరే వరకూ సాయం అందించాలన్నదే మా సంకల్పం.
–డాక్టర్ బొల్లం సతీష్,
వ్యవస్థాపకుడు, శ్రీయువసేన
స్వచ్ఛంద సేవా సంస్థ, కాకినాడ


