● 108 రోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు
● 864 భజన సమాజాలతో
2592 గంటల పాటు సంకీర్తన
● వేదిక కానున్న దుర్గాడ శివాలయం
పిఠాపురం: గొల్లప్రోలు మండలం దుర్గాడలోని ప్రసిద్ధ పంచాయతన సమేత ఉమా రామలింగేశ్వర ఆలయ స్వర్ణోత్సవ, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అరుదైన ఘనత సాధించేందకు సిద్ధమయ్యారు. 108 రోజుల పాటు నిర్వరామంగా భజన నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో స్వామి వారిని ప్రతిష్టించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 864 భజన సమాజాలతో 2592 గంటల పాటు నిర్విరామ భజన నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఇది ప్రపంచ రికార్డు సాధించే అవకాశం ఉండడంతో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. దీనిలో భాగంగా శనివారం ఆలయం ఆవరణలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి పందిరి రాట వేశారు.


