దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌

Jul 8 2026 12:09 AM | Updated on Jul 8 2026 12:09 AM

కాకినాడ లీగల్‌: జీఓ–396కి వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన రెండు రోజుల పెన్‌డౌన్‌తో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి రూ.4 కోట్ల మేర గండి పడిందని ఉద్యోగులు చెబుతున్నారు. లేఖర్ల ఆందోళనతో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. తొలి రోజు జగ్గంపేటలో 1, పిఠాపురంలో 3, కాకినాడలో 1 కలిపి మొత్తం 5 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.7.50 లక్షల ఆదాయం వచ్చింది. రెండో రోజయిన మంగళవారం జిల్లాలోని 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్‌ కూడా జరగలేదు. దస్తావేజు లేఖర్ల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీజే ప్రసాద్‌, కాకినాడ దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ, జీఓ–396 అమల్లోకి వస్తే వేలాది మంది లేఖర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

రిజిస్ట్రేషన్ల శాఖకు

రూ.4 కోట్ల ఆదాయానికి గండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement