ఎన్నాళ్లీ తిరుగుడు
పీజీఆర్‌ఎస్‌పై ప్రజల పెదవివిరుపు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సమస్యలతో విసుగుపోయాం.. ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం.. వీటిపై అధికారులకు మొరపెట్టుకుంటున్నాం.. అయినా పరిష్కారం కానరావడం లేదని అర్జీదారులు మండిపడుతున్నారు. ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)పై పెదవి విరుస్తున్నారు. ఎన్నాళ్లీ తిరుగుడు అంటూ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ హరేంధిరప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నుంచి మొత్తం 347 అర్జీలు వచ్చాయి.
నాలుగు సార్లు ఫిర్యాదు చేశా..
నా వ్యవసాయ భూమిని పక్కనే ఉన్న దేవదాయ శాఖ భూమిలో కలిపివేశారు. సర్వే చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటికే నాలుగుసార్లు అధికారులకు ఫిర్యాదు చేశాను. నా భూమి ఆన్‌లైన్‌లో చూపడం లేదు. దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవాలి.
–ఎస్‌వీ హరికుమార్, ఇంజరం, తాళ్లరేవు మండలం
పింఛను ఇప్పించండి
కిడ్నీ, గుండె, లివర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాను. నా అనారోగ్య సమస్యల కారణంగా కుటుంబ సభ్యులు చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మందులకు నెలకు రూ. 10 వేల ఖర్చు అవుతుంది. పింఛన్ ఇవ్వాలని అధికారులకు స్థానికంగా వినతి అందించాను. ఏడాది నుంచి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాను. అయినా పింఛన్ ఇవ్వడం లేదు.
–కంకణాల ప్రసాద్, సామర్లకోట
ఎండనక, వాననక చెరువులు తవ్వుతారు.. తట్టెత్తి మట్టిని మోస్తారు.. పార పట్టి చెత్తను తీస్తారు.. శ్రమైక్య జీవనం సాగిస్తారు.. చెమట చిందించి సొంత ఊరిలోనే ఉపాధి పొందుతారు.. అలాంటి వారినీ చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. చేసిన పనులకు వేతనాలు ఇచ్చేందుకు మొండి వైఖరి అవలంబిస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేక, కూలీలకు ఆకలి కేకలే మిగులుతున్నాయి.
గతమెంతో ఘనం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ కూలీలకు బకాయిలు లేకుండా వారి ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేవి. వారి శ్రమకు తగిన ఫలం ఎప్పుటికప్పుడు అందేది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా పరిస్థితి తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు, నాలుగు నెలలకు పైగా కూలి సొమ్ము పెండింగ్ పెట్టడంతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనులకు వస్తుంటే, ఇలా చేయడం సరికాదని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సకాలంలో కూలీలకు జమ చేయడం లేదని పలువురు అంటున్నారు. ఇలా సామర్లకోట, పిఠాపురం, కరప, గోకవరం, జగ్గంపేట, గోకవరం, ఏలేశ్వరం కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో మూడు నెలలు, మరికొన్ని మండలాల్లో రెండు నెలలు కూలి సొమ్ము పడాల్సి ఉంది.
గొల్లప్రోలు మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): చెమట చిందిస్తున్న శ్రమజీవులకు చంద్రబాబు ప్రభుత్వంలో కన్నీళ్లు తప్పడం లేదు. పొట్ట నింపుకొనేందుకు ఎండనక, వాననక పనులు చేసినా, ఉపాధి కూలీలకు వేతనాలు అందించపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 1.59 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో 1.21 లక్షల మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. ఈ ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు సుమారు రూ.52 కోట్ల మేర కూలి బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సుమారు 92 వేల మంది కూలీలు తమ కష్టార్జితం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే జూలై 1 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి వీబీజీ రాంజీ పథకంగా పేరు మార్చి అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ పథకం కింద పనులు జరుగుతున్నాయి. అయితే పాత బకాయిలపై స్పష్టత లేకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. కొత్త పనులు చేయాలా.. లేదా..? పాత డబ్బులు ఎప్పుడు ఇస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనులే తమకు ప్రధాన ఆధారమని కూలీలు చెబుతున్నారు. ఇప్పటికే చేసిన పనులకు వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కూలి సొమ్ము ఇవ్వకపోవడంతో తమ కుటుంబాల పోషణ కష్టం మారిందని కూలీలు మండిపడుతున్నారు. కొత్త పథకం అమలు చేస్తున్న అధికారులను పాత డబ్బుల మాట ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు.
పేరు మార్పు సరే..
ఇప్పటి వరకూ మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి చూపేవారు. 1 నుంచి కేంద్ర ప్రభుత్వం దీని పేరును వీబీజీ రామ్‌జీగా మార్చింది. ప్రస్తుతం కూలీల హాజరు, పాత బకాయిలు అంతా కూడా కొత్త పథకం పేరుతోనే నమోదవుతున్నాయి. నెలలుగా బకాయిలు చెల్లించా ల్సి ఉండగా, ఆ డబ్బులు ఎప్పుడు పడతాయని కూలీ లు ఎదురు చూస్తుండగా, ప్రస్తుతం పేరు మార్పు కారణంగా తమ బకాయిలు ప్రభుత్వం ఇవ్వదనే అపోహ అందరిలో వెంటాడుతుంది. పథకం పేరు మార్పుతో ఇకపై కొత్త యాప్‌లోనే కూలీలు తమ ఉపాధి మస్తర్లు నమోదు చేసుకుంటున్నారు. పాత పేరుతో వేసిన మస్తర్లు, పనులు ప్రస్తుతం కొత్త యాప్‌లో కనిపించకపోవడంతో తాము కష్టపడి పనిచేసినా ప్రభుత్వం ఎసరు పెడుతుందనే ఆందోళన ఎక్కువైంది.
● ఆందోళన వద్దు
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు వీబీజీ రామ్‌జీ పథకంగా మార్చారు. పేరు మార్చినా కూలీలకు ఎటువంటి ఇబ్బంది ఉండ దు. వారి బకాయి వేతనాలు తప్పక పడతాయి. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దు. చేసిన ప్రతి పనికి డబ్బులు మంజూరు చేస్తాం. త్వరలోనే వారి ఖాతాల్లో సొమ్ము జమవుతుంది.
–ఎస్.మధుసూదన్, డ్వామా పీడీ ●
06కేకేడీ182: ఎస్.మధుసూదన్, డ్వామా పీడీ
గోకవరం: భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య ఆలయాల్లో శ్రీరామ నవమి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణానికి సంబంధించి కోటితలంబ్రాల కోసం పండించే పంటకు శ్రీకారం చుట్టారు. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో 16వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఎకరం పొలంలో కోటి తలంబ్రాల పంటను పండిస్తున్నారు. సోమవారం శ్రీరాముని వేషధారణతో పాటు జాంబవంతుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు వేషధారణలో భక్తులు రామనామ స్మరణతో పొలంలో దుక్కి దున్ని విత్తనాలు చల్లి నారుమడిని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిపారవశ్యంతో సాగింది. కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ వచ్చే ఏడాది భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి తలంబ్రాల కోసం సుమారు 800 కిలోల ధాన్యం అవసరం అవుతుందన్నారు. ఇక్కడ నాటే వరి విత్తనాలను భద్రాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీసుకువచ్చామన్నారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని ఆంధ్ర, తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని ఐదు వేల మంది భక్తులకు పంపించి గోటితో ఒడ్లు ఒలిపించి తలంబ్రాలు సిద్ధం చేస్తామన్నారు. భద్రాచలానికి 16వ సారి, ఒంటిమిట్టకు 9వ సారి, అయోధ్యకు నాలుగోసారి ఈ తలంబ్రాలు పంపించామని చెప్పారు.
తుని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న దస్తావేజు లేఖర్లు
కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న దస్తావేజు లేఖర్లు
ఫ ఉపాధి కూలీలకు వేతన బకాయిలు
ఫ జిల్లాలో రూ.52 కోట్ల మేర పెండింగ్
ఫ సుమారు 92 వేల మందికి తప్పని పాట్లు


