కాకినాడ లీగల్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (సర్)ను వేగవంతం చేయాలని కాకినాడ సిటీ నియోజకవర్గ నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సర్ ప్రక్రియను పరిశీలించారు. నగర నియోజకవర్గంలో 46 శాతం మాత్రమే ఈ ప్రక్రియ డిజిటలైజేషన్ పూర్తయ్యిందని గమనించిన జాయింట్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు సూచించారు. ఒకవైపు ఓటర్ల నుంచి ఫారాలను స్వీకరిస్తూనే, మరోవైపు వాటిని వెంటనే డిజిటలైజేషన్ చేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి దశను ఈఆర్వోలు, ఏఈఆర్వోలు నిశితంగా పర్యవేక్షిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈఆర్వో, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ ఇప్పటికే ఏఈఆర్వోలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు. సమావేశంలో ఏఈఆర్వో, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ గోవిందరాజులు పాల్గొన్నారు.
కూటమి సర్కారులో నిరుద్యోగులకు అన్యాయం
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: కేజీ బేసిన్ పరిధిలోని ఐదు జిల్లాల ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ బేసిన్ ప్రయోజనాలపై నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీ బేసిన్ ద్వారా రావాల్సిన ఉద్యోగులను పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కేజీ బేసిన్‌లో లభ్యమవుతున్న సహజ వాయువుల నుంచి వచ్చే గ్రీజ్ టియర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వం యువతకు రుణాలు, రాయితీలు ఇచ్చి చిన్న కంపెనీలు పెట్టిస్తే నిరుద్యోగ సమస్య కొంత వరకు తగ్గుతుందన్నారు. అమలాపురంలో గ్యాస్ ఆధారిత ఇండస్ట్రీయల్ పార్కు కోసం జిల్లా కలెక్టర్ ఎస్టేట్ ల్యాండ్ ఎలకేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఓఎన్జీసీ రిలేటెడ్‌గా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌కు గ్యాస్ ఆధారిత ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇలా చేస్తే కేజీ బేసిన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ముఖ్యంగా ఇంజినీరింగ్‌లో టెక్నికల్ అభ్యర్థులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
15 నుంచి అమరావతి చాంపియన్‌షిప్ పోటీలు
అమలాపురం రూరల్: హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న జరిపే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమరావతి చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ నిడియాదేవి, ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి ఆగస్టు 26 వరకు మూడు దశల్లో పోటీలు ఉంటాయన్నారు. అండర్–17, 23 బాలురు, బాలికల విభాగాల్లో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర 12 క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు.
పనిచేయని బీఎల్‌ఓలపై
చర్యలు తీసుకోండి
అమలాపురం రూరల్: అమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో పనిచేయని బీఎల్‌ఓలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవికి వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చీకట్లు కిషోర్, జిల్లా ఎస్‌ఐఆర్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు తోరం గౌతంరాజా వినతిపత్రం అందించారు.
పట్టణంలో 48వ బూత్‌లో బీఎల్‌ఏ ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎ న్యూమనేషన్ పత్రాలు ఇవ్వకుండా, బయట వ్యక్తుల తో పంపుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన షె డ్యుల్ సమయం దగ్గర పడుతున్నా, సర్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్నారు. ఇక్కడ బీఎల్‌ఓను మా ర్పు చేసి, ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరారు.


