కడలిలో కలిపేసుకుని..
ఆశల సౌధం అలలకు కరిగిపోతోంది.. పేర్చిన ఇటుక ఒక్కొక్కటిగా కూలిపోతోంది.. చివరికి కడలిలో కలసిపోతోంది. జ్ఞాపకాల పునాదిని మిగుల్చుతోంది.. ఉప్పాడ తీరంలో మత్స్యకారుల జీవన విధానానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఉప్పాడ తీర రక్షణకు నిర్మించిన రక్షణ గోడ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా నిలిచింది. ఆనక పర్యవేక్షణ లేక ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రక్షణ గోడ మూడొంతులు సముద్రంలో కలిసిపోయింది. తుపాన్లు వచ్చినప్పుడల్లా ప్రజాప్రతినిధుల హామీలు తప్ప, ఆచరణ లేక ఆస్తులు, విలువైన భూములు, ప్రభుత్వ భవనాలు ఇలా కడలిలో కలిసిపోతున్నాయి.


