సీడీపీఓ ఆత్మహత్యపై విచారణ | - | Sakshi
Sakshi News home page

సీడీపీఓ ఆత్మహత్యపై విచారణ

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

రాజవొమ్మంగి: రాజవొమ్మంగి సీడీపీఓగా పని చేస్తూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె చికిత్స పొందుతూ మే నెల 6వ తేదీన మరణించింది. దీనిపై విచారణ జరుగుతోందని స్థానిక ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్‌రాజు కోర్టు ఇచ్చిన ఇంటెరిమ్‌ ఆర్డర్‌తో ఆదివారం రాజవొమ్మంగి స్టేషన్‌కు వచ్చారని ఎస్సై అన్నారు. కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ ఈ నెల 14 వరకు చెల్లుతుందన్నారు. కాగా సీడీపీఓ కేసు విచారణ నిమిత్తం పోలీసులకు సహకరించాలని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్‌కు వెళ్లాలని కోర్టు శ్రీకాంత్‌రాజుకు షరతులు విధించడంతో ఆయన లాయర్‌ను వెంట పెట్టుకొని స్టేషన్‌కు వచ్చారని ఎస్సై అన్నారు. దీంతో శ్రీకాంత్‌రాజును విచారిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement