● ఏప్రిల్‌లోనే ఇంటర్ ఫలితాలు
● డిగ్రీ ప్రవేశాలకు
ఇప్పటికీ వెలువడని నోటిఫికేషన్
● రెండున్నర నెలలుగా
నిరీక్షిస్తున్న విద్యార్థులు
● ఎడతెగని జాప్యంతో కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లు
ప్రైవేటు ఇంజినీరింగ్
కళాశాలల లబ్ధి కోసమే..
ప్రైవేటు, కార్పొరేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు లబ్ధి చేకూర్చేందుకే ప్రతి ఏటా డిగ్రీ కళాశాలల నోటిఫికేషన్ కావాలని జాప్యం చేస్తున్నారు. దీని వలన డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు నష్టం కలుగుతుంది.
– బి.సిద్ధూ, రాష్ట్ర సహ కార్యదర్శి,
పీడీఎస్‌యూ, వెదురుపాక, రాయవరం మండలం
నోటిఫికేషన్ విడుదల కావాలి
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు అడ్మిషన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది.
– డాక్టర్ టీకేవీ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండపేట
రాయవరం: డిగ్రీ అడ్మిషన్లపై చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా గందరగోళాన్ని సృష్టిస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. డిగ్రీ అడ్మిషన్లపై ఇప్పటి వరకూ ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు ఏప్రిల్ 15న విడుదలయ్యాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 36,450 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ ఫలితాలు సైతం జూన్ 18న విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలు విడుదలై రెండున్నర నెలలు దాటుతున్నా డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ఇప్పటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో, డిగ్రీ ప్రవేశాలకు అసలు నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు.. ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది.. తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక పలువురు విద్యార్థులు కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నోటిఫికేషన్ రాకపోవడంతో ఆ విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకుని సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరికకు కౌన్సెలింగ్ షెడ్యూల్ సైతం ప్రకటించారు. కానీ, డిగ్రీ ప్రవేశాలకు మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడా అని నిరీక్షిస్తున్నారు.
రెండేళ్లుగా ఇదే పరిస్థితి
డిగ్రీ తరగతులు 2024–25 విద్యా సంవత్సరంలో ఆగస్టు నెలాఖరుకు ప్రారంభం కాగా, గత విద్యా సంవత్సరంలోనూ అదే పరిస్థితి ఉంది. ఆగస్టు 20న నోటిఫికేషన్ విడుదలవగా, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించారు. ఈ ఏడాదైనా జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభిస్తారని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆశించాయి. కానీ, ప్రభుత్వం ఆ విషయాన్నే మరచినట్టు కనిపిస్తోంది. అడ్మిషన్లలో ఎడతెగని జాప్యం జరుగుతూండటంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో వేలాదిగా సీట్లు మిగిలిపోతున్నాయి.
ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఈ 171 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 53,978 సీట్లు ఉండగా.. గత విద్యా సంవత్సరంలో
20,277 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందారు. మిగిలిన 33,701 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
జిల్లా ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు ప్రైవేటు అన్ మహిళా కళాశాలలు మొత్తం సీట్లు గత ఏడాది ఖాళీ
అటానమస్ అటానమస్ ఎయిడెడ్ ఎయిడెడ్ ప్రభుత్వ ప్రైవేటు అడ్మిషన్లు సీట్లు
తూర్పుగోదావరి 6 1 0 1 39 2 4 16,770 6,748 10,022
కాకినాడ 5 2 1 2 44 0 7 22,206 9,834 12,372
కోనసీమ 7 0 1 0 45 0 4 15,002 3,965 11,037


