కనీస పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోతున్నాం. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకుని పట్టు రైతును ఆదుకోవాలి. లేకపోతే గొల్లప్రోలు మండలంలో పట్టు సాగు లేకుండా పోయే పరిస్థితి ఎదురవుతుంది.
– వులవకాయల రాంబాబు, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం
ప్రత్యేకత ఉన్న పంటను పట్టించుకోపోతే ఎలా?
పట్టు పరిశ్రమ అంటే దేశంలోనే అత్యంత ప్రాధాన్యమైనది. ఈ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వకపోవడం దురదృష్టకరం. గత వైఎస్సార్ సీపీ హయాంలో పాత బకాయిలతో సహా ఇన్సెంటివ్ ఇచ్చి ఎక్కువ ధర వచ్చేలా చూసి పట్టు గూళ్లు ఇక్కడే కొనుగోలు జరిగేలా ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు కనీసం పట్టించుకోడం లేదు. ఇచ్చిన హామీలు విస్మరించారు. దానికి నిదర్శనమే పట్టు సాగు తగ్గిపోవడం. బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రైతులతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.
– వంగా గీత, వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, పిఠాపురం


