కాస్త అవగాహన.. మరింత జాగ్రత్త ఉంటేనే విలువైన ఓటు అనే వజ్రాయుధాన్ని కాపాడుకోగలం. రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు సంరక్షణ ఎంతో అవసరం.. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) జరుగుతోంది. దీనిపై జనంలో అనేక అనుమానాలు ఉన్నాయి | - | Sakshi
Sakshi News home page

కాస్త అవగాహన.. మరింత జాగ్రత్త ఉంటేనే విలువైన ఓటు అనే వజ్రాయుధాన్ని కాపాడుకోగలం. రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు సంరక్షణ ఎంతో అవసరం.. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) జరుగుతోంది. దీనిపై జనంలో అనేక అనుమానాలు ఉన్నాయి

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

ఓటు ఉండాలంటే జాగ్రత్త అవసరం

అవగాహనతోనే సందేహాల నివృత్తి

పిఠాపురం: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కొద్ది రోజులుగా జరుగుతోంది. దీనిపై జనంలో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు ఉన్నాయి. సర్‌ కార్యక్రమం అందరినీ టెన్షన్‌ పెడుతోంది. ఓటు ఉంటుందో లేదో అనే ఆందోళన ఎక్కువవుతోంది. పక్కాగా ఓట్లు ఉండడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతుంటే, కొందరివి తొలగిస్తారంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై ఓటర్లు అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని 1,640 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 16,50,811 మంది ఓటర్లకు గాను.. 13,25,011 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేశారు. 3,25,800 మంది ఓటర్లు మ్యాపింగ్‌ కాలేదు. దీంతో వీరంతా మ్యాపింగ్‌ చేయించుకోవడంతో పాటు తమ ఓట్లు రద్దు కాకుండా చూసుకోవడానికి తగిన ఆధారాలు చూపించాల్సి ఉంది. లేకుంటే ఇబ్బందే.

ఇలా చేయండి

ఓటర్లు ముందుగా 2002 ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి. ప్రస్తుతం ఎన్యూమరేషన్‌ పూర్తి చేసి ఇస్తేనే ఓటు కొనసాగుతుంది. జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. అందులో పేరు లేకుంటే ఆగస్టు 20లోగా అభ్యంతరం తెలియచేయాలి. వాటిని పరిష్కరించి సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కు పోయినట్లే.

బీఎల్‌ఓలు రాకుంటే..

ఇప్పటివరకు బీఎల్‌ఓలు మీ ఇంటికి రాకుంటే తక్షణం వారిని సంప్రదించండి. 2002 ఓటరు జాబితాలో పేరు ఉంటే ఎటువంటి అదనపు వివరాలు బీఎల్‌ఓకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రతి బీఎల్‌ఓ మీ ఫొటో వివరాలు ముద్రించిన రెండు ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇస్తారు. ఇందులో ఒక ఫారం మీ దగ్గర ఉంచుకుని, ఇంకొకటి మీ బీఎల్‌ఓకి ఇవ్వాలి. ఎన్యూమరేషన్‌ ఫారంపై మీ తాజా ఫొటో అంటించి, ఫారం పూర్తి చేసి సంతకం చేసి ఇవ్వాలి. ఒకవేళ మీ తరఫున ఎవరైనా ఈ ఫారాలు అందజేస్తే, ఆ ఓటరు మీకు ఏమవుతారు? అనే వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తే ఎలాంటి శిక్ష విధిస్తారనే వివరాలు మీకు తెలుసని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌ కూడా ఇవ్వాలి. మీకిచ్చిన ఎన్యూమరేషన్‌ ఫారంలో ‘గత ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితాలో ఓటరు వివరాలు’ అనే కాలంలో వివరాలు పూర్తి చేస్తే సరిపోతుంది. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు (అందుబాటులో ఉంటే) ఇవ్వాలి. తప్పనిసరి కాదు, బంధువు పేరు తండ్రి లేక తల్లి జిల్లా, రాష్ట్రం నియోజకవర్గం, బూత్‌ నంబర్‌ వివరాలు ఇవాల్సి ఉంటుంది.

ఈ గుర్తింపు పత్రాల్లో ఏదొకటి చాలు

ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగి గుర్తింపు కార్డు లేక, పెన్షన్‌ గుర్తింపు కార్డు.

ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు

ఫ ఫ విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు

ఫ సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం

ఫ ఓటరు పుట్టిన తేదీ, ఆధార్‌ కార్డు నంబరు (ఇది ఐచ్ఛికం), మొబైల్‌ నంబర్‌, తండ్రి పేరు, తండ్రి లేక సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నంబరు (అందుబాటులో ఉంటే), తల్లి పేరు, తల్లి ఓటరు కార్డు (అందుబాటులో ఉంటే), జీవిత భాగ స్వామి (వర్తిస్తేనే) పేరు, జీవిత భాగస్వామి ఓటరు కార్డు నంబరు (అందుబాటులో ఉంటేనే) ఇవ్వాల్సి ఉంటుంది.

ఫ సంబంధిత శాఖలు జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు

ఫ నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌

ఫ రాష్ట్ర, స్థానిక అధారిటీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్‌

ఫ ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్‌

ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చు

వేరే ప్రాంతాల్లో నివసించే వారు కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించే వీలుంది. దీనికోసం ‘ఈసీఐనెట్‌’ యాప్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ‘ఈ–సైన్‌’ ద్వారా ఫారాన్ని సమర్పించేందుకు మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డుతో అనుసంధానించి ఉండాలి. గుర్తింపు కార్డుపై ఉన్న ఓటరు పేరు స్పెల్లింగ్‌, ఓటు ఆధార్‌ కార్డుతో కచ్చితంగా సరిపోవాలి. ఏదైనా వ్యత్యాసం ఉంటే డిజిటల్‌ ఈ–సైన్‌ విఫలం అవుతుంది. అలాంటప్పుడు ఓటర్‌ తన బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ ద్వారా ఫిజికల్‌గా ఫారం సమర్పించాల్సి ఉంటుంది.

నోటీసులు ఎవరికి ఇస్తారంటే?

ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు వచ్చినప్పటికీ, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌లో పాక్షిక తేడాలను గుర్తించిన ఓటర్లతో పాటు 2002 ఓటర్ల జాబితాతో తమతో పాటు తమ బంధువుల పేర్లు లేని ఓటర్లకు ఈఆర్వోలు నోటీసులు ఇస్తారు. నిర్దేశిత తేదీ విచారణకు హాజరై వీరు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ లేక తమ తల్లిందండ్రుల పుట్టిన తేదీ పుట్టిన ప్రాంతం ధ్రువీకరణగా ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఎవరికీ 2002 ఓటరు జాబితాలో పేరు ఉండే అవకాశం లేదు. వీరంతా తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే, తండ్లి లేక తల్లి 2002లో ఎక్కడ ఓటు కలిగి ఉన్నారనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. దీని కోసం బీఎల్‌ఓ ఇచ్చిన ఎన్యుమరేషన్‌ ఫారం రెండో కాలంలో గత ఎస్‌ఐఆర్‌లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. తండ్రి పేరు అనేచోట ఆయన ఓటరు కార్డు నంబరు బంధువు పేరు ఉన్నచోట తాతయ్య లేక తండ్రి ఓటుహక్కు కలిగి ఉన్న నియోజకవర్గం, బూత్‌ నంబరు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

కాకినాడ జిల్లాలో సర్‌ ప్రక్రియ ఇలా..

నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలింగ్‌ బూత్‌లు ఈఎఫ్‌ పంపిణీ ఈఎఫ్‌ డిజిటలైజేషన్‌

తుని 226071 224 225615 126064

ప్రత్తిపాడు 219988 227 219988 76571

పిఠాపురం 240773 242 240770 105313

కాకినాడ రూరల్‌ 271318 264 271311 107184

పెద్దాపురం 218002 201 218002 99174

కాకినాడ సిటీ 242514 234 242241 79290

జగ్గంపేట 232145 248 232141 103301

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement