ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి నలుగురు భక్తులు వేర్వేరుగా శుక్రవారం రూ.9,53,338 విరాళంగా అందజేశారు. నల్లజర్లకు చెందిన కొఠారి సురేష్ రూ.6,52,222, పెనుగొండ మండలం నడిపూడికి చెందిన కాశీ విశ్వేశ్వర సత్య హరిశ్చంద్ర వీర వెంకట సత్యనారాయణ రూ.1 లక్ష, హైదరాబాద్‌కు చెందిన చెరువు శివరామకృష్ణ శాస్త్రి రూ.1 లక్ష, ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేటకు చెందిన పాకలపాటి కృష్ణ రూ.1,01,116 లను నిత్యాన్నదాన ట్రస్ట్‌కు జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ప్రధానార్చకుడు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు, ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్లు ఐవీ రామారావు, కోటగిరి కిషోర్ విరాళం బాండ్‌లను అందజేశారు.


