అమ్మవారి మంగళ సూత్రాల అపహరణ | - | Sakshi
Sakshi News home page

అమ్మవారి మంగళ సూత్రాల అపహరణ

Jul 4 2026 12:14 AM | Updated on Jul 4 2026 12:14 AM

సఖినేటిపల్లి: కేశవదాసుపాలెం గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి మంగళ సూత్రాలు అపహరణకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు శుక్రవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీన పట్ట పగలు ఈ చోరీ జరిగింది. దీనికి సంబంధించి ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ అనుమానిత వ్యక్తిని గుర్తించారు. అతడి సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్‌ స్టేషన్‌కు తెలియజేయాలని ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement