‘అన్నపూర్ణ’లాంటి నేలతల్లిని నమ్ముకుని.. కోట్లాది మంది కడుపాకలి తీర్చే సాగు యజ్ఞానికి అన్నదాత శ్రీకారం చుట్టాడు. అదునుకు చినుకు రాలకపోయినా.. చెమట చుక్కలతో భూమిని తడిపి.. దుక్కి చేసి, నారు పోసి, నాట్లు వేసి, పసిడి పంటలకు ప్రాణం పోసేందుకు అడుగు వేశాడు. సమయం మించిపోతే ‘పంట పండదేమో’ననే ఆందోళన వెంటాడుతున్న వేళ.. అవకాశమున్నచోట్ల కర్షకులు.. నేల పొరల్లో దాగిన పాతాళగంగను వెలికితీసి.. మడికి తడిని అందించి.. వరి నాట్లు వేస్తూ.. పుడమితల్లికి ఇలా పచ్చ బొట్లు పెడుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకట నగరం – తొర్రేడు గ్రామాల మధ్య ఈ శ్రమైకజీవన
సౌందర్యం ఆవిష్కృతమైంది.
– ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్,
రాజమహేంద్రవరం


