మరో కేసులో అరెస్టుకు పోలీసుల యత్నం
కాకినాడ లీగల్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో జోసెఫ్ అలియాస్ రావణ్‌ను సర్పవరం పోలీసులు బుధవారం రాత్రి మరోసారి అరెస్టు చేశారు. ఆయనను కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం హాజరు పరిచారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో మెజిస్ట్రేట్ ఎన్.ఉషా లక్ష్మీ కుమారి ఎదుట ఆమె నివాసంలో హాజరు పరిచారు. జోసెఫ్ తరఫున జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. అనంతరం, సొంత పూచీకత్తుతో జోసెఫ్‌కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. కాగా, జోసెఫ్‌ను ప్రభుత్వం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనను మరో కేసులో అరెస్టు చేసేందుకు మచిలీపట్నం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


