సీఎంఆర్‌ బియ్యం ఇవ్వడంలో ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ బియ్యం ఇవ్వడంలో ఇబ్బందులు

Jun 30 2026 12:07 AM | Updated on Jun 30 2026 12:07 AM

కాకినాడ డీమార్టు సమీపంలో ఓ టీచర్‌ రాత్రి వేళ ద్విచక్ర వాహనంపై వెళ్తూ రోడ్డుపై ఉన్న పశువులను ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.

వార్పు రోడ్డులో ఓ న్యాయవాది కోర్టుకు వెళ్తుండగా, ఓ ఎద్దు వేగంగా వచ్చి ఆయన బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు

తీవ్ర గాయాలయ్యాయి.

ఓ కుటుంబం ఉప్పాడ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, బీచ్‌ రోడ్డులో పశువులు వేగంగా

వాహనంపైకి దూసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో

7 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ

జీజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందించారు.

కాకినాడ క్రైం: ఈ ఘటనలు మచ్చుకు కొన్నే... జిల్లా వ్యాప్తంగా రోజుకు అనేకచోట్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పశువుల వల్ల రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోక ప్రజా జీవనానికి, ప్రయాణానికి శాపంగా పరిణమిస్తోంది. రోడ్డెక్కితే భయంగా భయంగా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఏడాది కాలంలో పశువుల కారణంగా 415 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరుకాక 1,390 మంది గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదాల్లో 350కి పైగా పశువులు గాయాల పాలైనట్లు అంచనా. వాహనాలు, ఆస్తుల నష్టం విలువ సుమారు రూ.3.5 కోట్లు అని అధికార గణాంకాలు చెబుతున్నాయి.

పశువులు రోడ్డెక్కుతున్నాయి.. జనజీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి.. అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి.. అయినా అధికారులు మనకెందుకే అన్నట్లు వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడతో పాటు చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. కాకినాడ జగన్నాథపురం, పెదమార్కెట్‌, సినిమారోడ్డు, జీజీహెచ్‌, గాంధీనగర్‌ మార్కెట్‌, సర్పవరం పూలమార్కెట్‌, రమణయ్యపేట మార్కెట్‌లో ఈ సమస్యల ప్రధానంగా ఉంది. సామర్లకోట మార్కెట్‌ వీధి, రైల్వే స్టేషన్‌ ప్రాంతాలు, పెద్దాపురంలో కట్టమూరు రోడ్డు, కాండ్రకోట రోడ్డు, వడ్లమూరు– దివిలి రహదారి, పిఠాపురంలో ఉప్పాడ సెంటర్‌, చర్చి సెంటర్‌, కోటగుమ్మం తదితర ప్రాంతాల్లో పశువులు తిష్ట వేస్తున్నాయి. తునిలోని ఎస్‌.అన్నవరం రోడ్డు, మెయిన్‌రోడ్డు, ఏలేశ్వరంలో దిబ్బలపాలెం, మార్కెట్‌ వీధి తదితర ప్రాంతాల్లో మూగజీవాలు నడిచే స్పీడ్‌ బ్రేకర్లుగా మారాయి. ఈ పశువుల సంచారం పలు అనర్థాలకు దారితీస్తోం. చివరికి ప్రాణనష్టం అనివార్యమవుతోంది. గుంపులు గుంపులుగా తిరగడం, రోడ్లపై తిష్ట వేయడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. రాత్రి వేళల్లో పశువులు సరిగ్గా కనిపించక, రోడ్డు ప్రమాదాలు చాలాచోట్ల జరుగుతున్నాయి. ఈ మూగజీవాల కారణంగా పారిశుధ్య సమస్య కూడా తలెత్తుతుంది. మలమూత్ర విసర్జకాల వల్ల మార్గం తేమగా మారి ద్విచక్ర వాహనదారులు, సైకిలిస్టులు, పాదచారులు జారిపడిపోయే ప్రమాదం ఉంది. ఒక్కో సందర్భంలో పశువులు తోసుకుంటూ, పొడుచుకుంటూ ప్రజలకు హాని కలిగించవచ్చు. ఇంత జరుగుతున్నా, ఐదు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఆవరించింది.

మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖ

ఇవి పశువుల నియంత్రణలో కీలకంగా వ్యవహరించాల్సిన శాఖలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామీణ ప్రాంతాల స్థాయిలో పశువులను పట్టుకోవడం, గోఽశాలలు నిర్మించి తరలించడం, రోడ్లపైకి పశువులను వదిలేసే యజమానులపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయడం ఈ శాఖ పని. ఇన్ని బాధ్యతలు ఉన్న వీరికి చీమకుట్టినట్టయినా లేకపోవడం శోచనీయం.

పోలీస్‌ శాఖలోని ట్రాఫిక్‌ విభాగం

ఇది రెండో కీలక విభాగం. రాత్రి వేళ ప్రమాదాల నివారణకు పశువుల కొమ్ములు, మెడకు రేడియం స్టిక్కర్లు అతికించేలా చొరవ తీసుకోవడం, వీటి సంచారం వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అయితే క్లియర్‌ చేసి, రాకపోకలను క్రమబద్ధీకరించడం, పశువులను వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పెంపకందార్లపై కేసులు నమోదు చేయడం వీరి పని.

పశుసంవర్థక శాఖ

రోడ్లపై జంతువుల సంచారం నివారించడంలో ఈ శాఖది కీలక పాత్ర. పశువులకు ఇనాఫ్‌ (ఈ–గోపాల/ఐఎన్‌ఏఎఫ్‌) గుర్తింపు ట్యాగ్‌లు వేయడం ద్వారా రోడ్లపై తిరుగుతున్న పశువు ఎవరిదో సులభంగా గుర్తించవచ్చు. తద్వారా యజమానులను పిలిచి అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ శాఖ అధికారులూ పట్టించుకోకపోవడం ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోంది. అంతేకాకుంగా పశువుల్ని రోడ్లపైకి వదిలేస్తే కలిగే నష్టాలు, పాకల్లో పెంచితే ఒనగూరే లాభాలపై పాడి రైతుల్లో అవగాహన కల్పించాలి. అలాగే నేషనల్‌ హైవే, రోడ్లు, భవనాల శాఖ అధికారులు సంయుక్త ప్రణాళికలు, కార్యాచరణతో రోడ్లపై పశువులు సంచారానికి అవకాశం లేని చర్యలు తీసుకోవాలి. రహదారులకు అటు ఇటు ఫెన్సింగ్‌లు లేదా ఐరన్‌ గ్రిల్స్‌ ఏర్పాటు చేసి పశువుల సంచారాన్ని నిలువరించాలి. సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలు గుర్తించి ‘క్యాటిల్‌ క్రాసింగ్‌’ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా కాలుష్య నియంత్రణ మండలి, పారిశుధ్య శాఖలు పశువుల విసర్జకాల వల్ల ఏర్పడే అపరిశుభ్రతను తొలగించి, కలుషితమయ్యే పరిసరాలను సంరక్షించాలి. వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి. ఈ ఐదు శాఖలు పరస్పర సమన్వయంతో సమస్యను పరిష్కరించాలి.

కాకినాడ సినిమా రోడ్డులో

రాత్రి వేళ తిష్ట వేసిన పశువులు

జీజీహెచ్‌ వద్ద...

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రబీ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌ ధాన్యం మర ఆడించి బియ్యం తిరిగి ఇవ్వడంలో జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు వల్లూరు సూర్యప్రకాశరావు తెలిపారు . స్థానిక జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంటీయూ 2636, ఎంసీ 13, 1156, 1153 రకాలు పచ్చి బియ్యంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మిల్లింగ్‌ చేసిన తర్వాత 35 శాతం నుంచి 45 శాతం వరకు నూకలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కనీసం 25 శాతం వరకు నూకలతో బియ్యం సేకరించడానికి ప్రభుత్వం అనుమతించాలని కోరామన్నారు. కానీ ఎఫ్‌సీఐ కేవలం 10 శాతం నూకలతో బియ్యాన్ని స్వీకరించడానికి అనుమతులు ఇచ్చిందన్నారు. అయితే రైస్‌ మిల్లర్ల విజ్ఞప్తి మేరకు 20 శాతం నూకలతో అనుమతులు వస్తాయని కొంతకాలం రైస్‌మిల్లర్ల యాజమాన్యం ఎంతగానో ఆశగా ఎదురు చూసిందన్నారు. ఎఫ్‌సీఐ నుంచి అనుమతులు రాకపోగా, జాప్యానికి కారణంగా నిలిచిందన్నారు. మర ఆడించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు తరలించాలంటే కాకినాడ జిల్లాలో గోదాములు ఖాళీగా లేవన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 550 రైస్‌మిల్లుల యాజమాన్యాలు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో గోదాములకు లారీల ద్వారా తరలించే వారమన్నారు. అందరూ ఏకకాలంలో బియ్యం తరలించడంలో లారీలు క్యూ కట్టి అన్‌లోడింగ్‌కు అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఇకపై సీఎంఆర్‌ బియ్యం ఇవ్వడానికి మిల్లర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. బియ్యం రైల్వే వేగన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించడంతో కాకినాడ జిల్లాలో ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇక నుంచి వేగంగా బిల్డింగ్‌ చేసి బియ్యం ఎఫ్‌సీఐకి ఇస్తామన్నారు.

‘జయలక్ష్మీ’ బాధితులకు న్యాయం చేయండి

బోట్‌క్లబ్‌ (కాకినాడసిటీ): జయలక్ష్మీ కోఆపరేటివ్‌ సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ స్టీరింగ్‌ కమిటీ కార్యదర్శి రఘుభూషణ్‌ మాట్లాడుతూ డిపాజిట్‌దారులకు ఎక్కువ వడ్డీ ఆశచూపడంతో సుమారు 19 వేల మంది ఈ సొసైటీలో డిపాజిట్లు చేశారన్నారన్నారు. సొసైటీ బోర్డు తిప్పేసిన తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికై న గంగిరెడ్డి త్రినాథరావుపై చర్యలు తీసుకోవాలన్నారు. జయలక్ష్మీ ఆస్తులను వేలం వేసి బాధితులు నష్టపోయిన సుమారు రూ. 600 కోట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీకి నెల్లూరులో ఉన్న ఆస్తి వేలం, సొసైటీలో రూ. 4.60 కోట్లు అవినీతి చేసిన గంగిరెడ్డి త్రినాథరావుపై పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు. సొసైటీలో రికార్డులు తారుమారు చేయకుండా భద్రత కల్పించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

ఇలా చేస్తే మేలు

శాఖల మధ్య సమన్వయం, ప్రణాళిక అమలు అత్యంత కీలకం. యజమానులు పశువులను రోడ్లపై వదిలేయకుండా చూడాలి. స్థానికంగా సంచార పశువులను గుర్తించి గోశాలలు లేకుంటే, నిర్దేశిత కేంద్రాలకు తరలించాలి. రోడ్లపై పశువుల్ని వదిలేస్తున్న యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తే కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. పశువుల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలి.

ఫ రోడ్లపై స్పీడ్‌ బ్రేకర్లుగా మూగజీవాలు

ఫ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

ఫ ఏడాదిలో 415 ప్రమాదాలు,

8 మంది మృత్యువాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement