అన్నవరం: రోజూ యోగా చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో బాటు మానసిక దృఢత్వం అలవడుతుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సోమవారం దేవదాయ, ధర్మాదాయశాఖ, పర్యాటక, ఆయుష్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ‘ యోగాంధ్ర ’కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థానం సిబ్బంది, భక్తులతో కలిసి ఆయన ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరుగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు రెండు లక్షల మంది పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పెద్దాపురం ఆర్డీఓ రాధాకృష్ణమూర్తి, పాల్గొన్నారు. సుమారు 500 మంది యోగాసనాలు వేశారు. అంతకుముందు కలెక్టర్‌కు రత్నగిరిపై దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధర్‌రావు స్వాగతం పలికారు.
పకడ్బందీగా ‘సర్’
బీఎల్‌ఓలకు కాకినాడ ఆర్డీవో మల్లిబాబు ఆదేశాలు
కాకినాడ లీగల్: స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటరు జాబితాల రూపకల్పన లక్ష్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కాకినాడ ఆర్డీవో కం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రూరల్ (ఈఆర్వో) ఎస్.మల్లిబాబు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కం అర్బన్ ఈఆర్వో కేటీ సుధాకర్ బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌ఓలు)ను ఆదేశించారు. కాకినాడ డివిజన్ పరిధిలో చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూల్ లెవెల్ అధికారులకు (బీఎల్‌ఓలు) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, జూలై 1, 2026ను అర్హత తేదీగా పరిగణించి ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ నిర్వహణపై బీఎల్‌ఓలకు సమగ్ర శిక్షణ అందించడంతో పాటు, జూన్ 15 నుంచి జూలై 14 వరకుఇంటింటి సర్వే నిర్వహించాలని సూ చించారు. జూలై 21న ముసాయిదా ఓటరు జా బితాలను ప్రచురించనున్నట్లు తెలిపారు. అనంతరం జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నా రు. వాటి పరిశీలన, అభ్యంతరాల పరిష్కార ప్ర క్రియను జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు నిర్వహించి, సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబి తాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అదనపు కమిషనర్, ఈఆర్వో కె.టి. సుధాకర్, అర్బన్ తహసీల్దార్, ఏఈఆర్వో జితేంద్ర, డిటి గోవిందరాజులతో పాటు ఎన్నికల శాఖ అధికారులు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన బీఎల్‌ఓలు పాల్గొన్నారు.


