ఔరా.. కొమ్ముసొర
సఖినేటిపల్లి: పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లోని ఫిష్ మార్కెట్‌కు శుక్రవారం 20 కిలోల బరువుగల కొమ్ముసొర చేప వచ్చింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిన్నపాటి సొరలతో పాటు ఈ పెద్ద కొమ్ముసొర చిక్కింది. సాధారణంగా ఐదు నుంచి పది కిలోల వరకూ బరువుగల సొరలు మార్కెట్‌కు వస్తుంటాయి. కాగా మార్కెట్‌లో ఈ పెద్ద సొరను రూ.8 వేలకు ఓ వ్యక్తి కొనుక్కున్నాడు.
మరిచిపోయిన
ల్యాప్‌టాప్ బ్యాగ్ అందజేత
సామర్లకోట: ప్లాట్‌ఫామ్‌పై ల్యాప్‌టాప్ బ్యాగ్ మరిచిపోయి రైలు ఎక్కిన ప్రయాణికుడికి తిరిగి అందజేసిన సంఘటన ఇది. గురువారం సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వచ్చిన లవుడు తేజ ల్యాప్‌టాప్ బ్యాగును కూర్చున్న బల్లపై వదిలేసి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. బ్యాగ్ మరిచిపోయిన విషయాన్ని గుర్తించి స్థానిక రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎర్ర రాజు, రవికుమార్, సుజాతలు ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను గుర్తించి జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో భద్రపర్చారు. అనంతరం స్టేషన్‌కు వచ్చిన తేజకు ఆ బ్యాగ్‌ను అందజేసినట్లు రైల్వే పోలీసులు శుక్రవారం విలేకర్లకు తెలిపారు.
ఔరా.. కొమ్ముసొర


