ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్‌ఐవోగా శారద
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా ఇంటర్‌బోర్డు రీజినల్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్‌గా (ఆర్‌ఐవో) ఐ.శారద నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కమిషనరేట్ నుంచి ఆమెకు బుధవారం ఉత్తర్వులు అందాయి. రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆమె గురువారం విధుల్లో చేరనున్నారు. ఆమె ఇప్పటి వరకు కాకినాడ జిల్లా డీవీఈవో గా పని చేశారు. గతంలో జోన్ 2 పరిధిలో ఇంటర్‌బోర్డు ఆర్జేడీగా విధులు నిర్వర్తించారు. శారద నియామకంపై జిల్లాలోని అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమె సాక్షితో మాట్లాడుతూ తాను గతంలో మాదిరే పనిచేస్తానని, కొద్ది నెలల్లో రాబోతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణలో పూర్తి అంకితభావంతో పనిచేస్తూ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ర్యాంకులు సాఽధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు.


