కోడి కత్తుల తయారీదారు అరెస్టు
దేవరపల్లి: గోపాలపురం మండలం హుకుంపేటలో కోడి కత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 40 కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ బీఎన్ నాయక్ బుధవారం తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోడి కత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్టు ఎస్సై మనోహార్, ట్రైనీ ఎస్సై శివగణేష్‌కు అందిన సమాచారం మేరకు హుకుంపేటలో కోడికత్తులు తయారు చేస్తున్న బొల్లం హరికృష్ణను అదుపలోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అతని నుంచి 40 కోడి కత్తులు, కత్తులను సానపట్టే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. సంక్రాంతి సందర్భంగా వీటిని తయారు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గతంలో కోడిపందేల్లో అరెస్టయిన వారిని, కోడిపందాలు, పేకాటలు నిర్వహించి కేసులు నమోదైన వారందని బైండోవర్ చేసినట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో 350 మంది, దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో 350 మంది పాత నేరస్తులు ఉన్నట్టు ఆయన చెప్పారు. మూడు రోజులుగా పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికి 70 మందిని బైండోవర్ చేసినట్టు ఆయన తెలిపారు.
21 కిలోల గంజాయి స్వాధీనం
కోడి కత్తుల తయారీదారు అరెస్టు


