కాకినాడలో నటి మీనాక్షి సందడి
లక్కీ సిగ్నేచర్ మాల్ ప్రారంభం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన నటించిన నటి మీనాక్షి చౌదరి నగరంలో సందడి చేశారు. కాకినాడ మెయిన్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ సిగ్నేచర్ ఫ్యామిలీ షోరూంను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను తన అభివాదాలు ముద్దు ముద్దు మాటలతో ముంచెత్తారు. పూర్తిగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌కు అందరి శుభాశీస్సులు అందించాలని మీనాక్షి కోరారు. మహిళల కోసం చీరలు, గాగ్రాలు, లెహంగాలు, ఎన్నో రకాలను అందుబాటు ధరలో అందిస్తోందన్నారు. ఆమెను చూసేందుకు హాజరైన ప్రజలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. షోరూమ్ అంతా తిరిగి రకరకాల చీరలను ఆమె తిలకించగా వాటి వివరాలను సిబ్బంది ఆమెకు వివరించారు. షోరూం అధినేతలు రత్తయ్య, శ్రీను, స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యామిలీ కనెక్షన్‌ల్లో తిరుగులేని ఆదరణ పొందుతున్న లక్కీషాపింగ్ మాల్‌ను కాకినాడలో ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు పాల్గొన్నారు.


