
రత్నగిరికి మూడు హెచ్‌వీఎల్‌ఎస్ ఫ్యాన్ల సమర్పణ
అన్నవరం: రత్నగిరి దేవస్థానానికి పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు రూ.ఆరు లక్షల విలువైన మూడు హెచ్‌వీఎల్‌ఎస్ (హై వాల్యూమ్ లో స్పీడ్) ఫ్యాన్లను శుక్రవారం అందచేశారు. వీటిలో రెండింటిని స్వామివారి వార్షిక కల్యాణమండపంలో అమర్చారు. మరో ఫ్యాన్‌ను షాపింగ్ కాంప్లెక్స్ ముందు గల మండపంలో ఏర్పాటు చేయనున్నారు. ఏడు మీటర్ల వ్యాసం కలిగిన ఈ ఫ్యాన్లను హెలికాప్టర్ ఫ్యాన్లుగా పిలుస్తుంటారు. ఈ ఫ్యాన్ గాలి సుమారు 20 అడుగుల వరకు వ్యాపిస్తుంది.