
శ్రీపాద శ్రీవల్లభ స్వామికి లక్ష బిల్వార్చన
పిఠాపురం: ప్రముఖ దత్త పుణ్యక్షేత్రమైన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రీపాద శ్రీవల్లభ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా పిఠాపురంలో ఆరవ రోజు సోమవారం లక్ష బిల్వార్చన పూజ నిర్వహించారు. ఈ సంధర్భంగా స్వామికి ఏకాంత సేవ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీవల్లభ సప్తాహ మహోత్సవాల్లో ప్రతి రోజు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ సౌజన్య తెలిపారు. స్వామివారికి విశేష అలంకారం చేయగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవల్లభ సప్తాహ మహోత్సవాల సందర్భంగా మరాఠీ భక్తులు పోటెత్తారు. 10 వేల మంది మహారాష్ట్ర భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శ్రీపాద శ్రీవల్లభ స్వామికి లక్ష బిల్వార్చన