హక్కులపై ఉక్కు పాదమా? | - | Sakshi
Sakshi News home page

హక్కులపై ఉక్కు పాదమా?

Aug 27 2025 9:02 AM | Updated on Aug 27 2025 9:02 AM

హక్కు

హక్కులపై ఉక్కు పాదమా?

బాలాజీచెరువు (కాకినాడ): కూటమి ప్రభుత్వ చర్యలు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయి. విద్యార్థి సంఘాలను నియంత్రించి, వారి గొంతును అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కారు. రాజ్యాంగం కల్పించిన విద్యార్థుల హక్కుకూ సంకెళ్లు వేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,285 ప్రభుత్వ పాఠశాలలు, 47 జూనియర్‌ కాలేజీలున్నాయి. గత నెలలో విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వసతుల లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై కక్ష పెంచుకుని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల నేతల ప్రవేశానికి అనుమతులు ఇవ్వద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ ఉత్తర్వులు నిరంకుశత్వానికి నిదర్శనం

కళాశాల్లోకి రాకూడదంటూ ఇచ్చిన జీఓపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చడం, వసతి గృహాల్లో నాసిరకమైన వసతులు, పలు సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్లకు అధిక ఫీజు వసూలు, అధిక ధరలకు పుస్తకాలు అమ్మడంపై విద్యార్థి సంఘాలు ప్రశ్నించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. విద్యా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ కళాశాలలపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం జూనియర్‌ కళాశాల్లోకి సైతం విద్యార్థి సంఘాల నేతలకు అనుమతి లేదంటూ మరో జీఓ జారీచేసింది. విద్యార్థి సంఘాలు విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల కోసం పోరాడటమే కాకుండా, విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి. నాయకత్వ లక్షణాలను, సామాజిక అవగాహనను, హక్కులు, బాధ్యతలను నేర్పిస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యల వెనుక విద్యార్థి సంఘాలను అణచివేయడం ద్వారా ప్రశ్నించి పోరాడే శక్తులను నిలువరించాలని, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం లేకుండా చేయాలనే ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమైనవని, నిరంకుశత్వ ధోరణికి నిదర్శనమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల నేతల ప్రవేశంపై నిషేధం

కళాశాలల్లోకి సైతం అనుమతి లేదని జీఓ

కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు

హక్కులపై ఉక్కు పాదమా? 1
1/1

హక్కులపై ఉక్కు పాదమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement