
అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఫీజులు, పుస్తకాల పేరుతో ఇప్పటికే రూ.లక్షల్లో దోపిడీ చేస్తున్నాయి. వీటిని అడ్డుకునేవారు లేకుండా చేయడం కోసం అడ్డగోలు జీఓలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలపై స్పందించేవారు లేకపోతే అధికారులు, ప్రభుత్వం ఎలా చేసినా అడిగేవారు లేకుండా పోతారు.
– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
ఆంక్షలు ఎత్తేయాలి
విద్యారంగంలోని సమస్యలపై ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటి హక్కులను కాలరాసేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేయడం దుర్మార్గం. విద్యను వ్యాపారం చేస్తున్న కళాశాలలపై గళం విప్పితే ఆంక్షలు విధించడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. తక్షణం విద్యార్థి సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి.
– బి.సిద్దూ, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి
విద్యార్థి సంఘాలపై ఆంక్షలు దుర్మార్గం
కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇచ్చిన హామీల అమలుకు విద్యార్థి సంఘాలు నిలదీశాయి. ప్రభుత్వ బడుల్లో, కళాశాలల్లో వసతులపై గళం విప్పాయి. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఆంక్షల పేరుతో విద్యాసంస్థల్లోకి అనుమతులు లేకుండా జీఓలు జారీ చేయడం దుర్మార్గం.
– పి.రవితేజ, నిరుద్యోగ జేఎసీ కన్వీనర్
●

అనాలోచిత నిర్ణయం

అనాలోచిత నిర్ణయం