
మోటారు సైక్లిస్ట్‌పైకి దూసుకెళ్లిన ఆబోతులు
చికిత్స పొందుతూ మృతి
అల్లవరం: రెండు ఆబోతులు పొట్లాడుకుంటూ దారిని పోతున్న వ్యక్తిపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అతను మృతి చెందిన సంఘటన అల్లవరం మండలం గుండెపూడిలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం... గుండెపూడి పోతులవారిపేట గ్రామానికి చెందిన జంగా రామకృష్ణ (41) గురువారం రాత్రి దేవగుప్తం సెంటర్ నుంచి మోటారు సైకిల్‌పై పోతులవారిపేట వెళ్తుండగా గుండెపూడిలోని ఆంజనేయస్వామి వారి ఆలయాలకు సమీపంలో రోడ్డుపై రెండు ఆబోతులు హోరాహోరీగా పోట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న రామకృష్ణపైకి రెండు ఆబోతులు దూసుకువచ్చాయి. దీంతో రామకృష్ణ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. సయమానికి ఎవరూ లేకపోవడంతో రామకృష్ణపై ఆబోతులు వీరంగం సృష్టించి మరింత గాయాలు పాల్జేశాయి. కొద్ది సేపటికి రోడ్డుపై పడి ఉన్న రామకృష్ణను స్థానికులు గుర్తించి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. తీవ్ర గాయాలైన రామకృష్ణ తలకు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆదివారం సాయంత్రం అతను మృతి చెందారు. ఈ ఘటనపై అల్లవరం ఎస్సై సంపత్‌కుమార్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, బాబు, పాప ఉన్నారు.