
కౌమార దశలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ): బాలికలు కౌమార దశలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఐసీడీఎస్ పీడీ లక్ష్మి అన్నారు. గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీ తమ సామాజిక బాధ్యతలో భాగంగా గాడిమొగ, భైరవపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 200 మంది విద్యార్థినులకు కౌమార దశలో బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దంటు కళా క్షేత్రంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్య రక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డీవైఈవో ఎస్.వెంకటేశ్వరరావు, సీడీపీవో మాధవి మాట్లాడుతూ, కౌమార దశలో బాలికల ప్రవర్తన, వారిని ఎలా రక్షించుకోవచ్చో తెలిపారు. పడాల చారిటబుల్ ట్రస్టు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం బాలికలకు రిలయన్స్ వారు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫైనాన్స్ హెడ్ మదన్ పాల్, సీఎస్సార్ హెడ్ పోతాప్రగడ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.