
ఏకై క సాహిత్య సంపద మనదే
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వేల గ్రంథాలతో అందుబాటులో వున్న ఏకై క సాహిత్య సంపద మనదని సమన్వయ సరస్వతీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక సూర్యకళా మందిరంలో సోమవారం రాత్రి సరస్వతీ గాన సభ ఆధ్వర్యంలో సనాతన ధర్మం – శాశ్వత న్యాయం అనే అంశంపై ఆయన ప్రవచించారు. మన భారత సాంస్కృతిక జీవనంలో ధర్మ ప్రవర్తన, న్యాయ జీవనం ఆచరింపబడుతున్న విషయాలన్నారు. వాటిని కల్పాంతరాలుగా ఆచరిస్తూ వస్తున్న ఏకై క ఆదర్శ దేశం భారతావని అని తెలిపారు. ఈ ధర్మం, న్యాయం ఒకేలా ఆలోచన చేస్తే ఒకే అర్థంలా అనిపించినా, వివరంగా ఆలోచన చేసినప్పుడు అనేక విషయాలు అర్థమవుతాయన్నారు. తప్పుడు చరిత్రలు అందుబాటులో ఉండడం దురదృష్టమని, ఈ విధానం మారి నిజం ప్రజలకు అందాలన్నారు. చాణక్య నీతి, సోమదేవ నీతి వంటి గ్రంథాలను ప్రస్తావించారు. తొలుత సామవేదానికి వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరస్వతీ గాన సభ గౌరవాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.