
కాకినాడలో మిత్రా హార్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్
కాకినాడ రూరల్: అత్యాధునిక ఏఐ క్యాత్, ఏఐ పరికరాలతో 24/7 గుండె, ఇతర అత్యవసర సేవల సౌకర్యాలతో కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్‌లో మిత్రా హార్ట్ ఇన్‌స్టిట్యూట్ మల్టీస్పెషాలిటీ హాస్పటల్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఓబుల్ రెడ్డి హార్ట్ కేర్ సెంటర్‌కు అనుబంధంగా డాక్టర్ ఓబుల్ రెడ్డి నూతనంగా ఈ ఆస్పత్రిని నెలకొల్పగా, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఏఐ క్యాత్ ల్యాబ్‌ను ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి.రాజశేఖర్ ప్రారంభించారు. ప్రపంచ స్థాయి అత్యాధునిక ఏఐ క్యాత్ ల్యాబ్‌ను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తొలిసారిగా తీసుకువచ్చామని వైద్యులు ఓబుల్ రెడ్డి, భార్గవి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత, పలువురు వైద్యులు పాల్గొన్నారు.