
పిఠాపురంలో.. చోర సైనికులు?
జనసేన కార్యకర్తలు
ఎత్తుకుపోయిన లారీలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘తప్పు చేసిన వాడిని తరిమితరిమి కొడతా.. బట్టలూడదీసి రోడ్డు మీద నడిపిస్తా.. తోలు తీస్తా.. తాట తీస్తా..’ అంటూ గత సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గర్జించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అంతే ఏడాది తిరిగేసరికి పిఠాపురంలో సీన్ రివర్స్ అయిపోయింది. చిన్న తప్పు జరిగినా ఉపేక్షించనని కుండబద్దలు కొట్టిన పవన్ ఇలాకాలోనే జనసేన శ్రేణులు దొంగతనాలకు కూడా వెనుకాడటం లేదు. అధికారం అండతో చెలరేగిపోతున్నారు. అటువంటి దొంగలను.. పవన్ వెంట తిరిగే ఆ పార్టీ ముఖ్య నేతలు వెనకేసుకు తిరుగుతూండటం చూసి పిఠాపురం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
లారీల చోరీలు
పిఠాపురం కుంతీ మాధవస్వామి గుడి వద్ద దగ్గు అప్పారావు నిలిపి ఉంచిన వంట నూనెల లారీని ఈ నెల 5న గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఈ లారీ కోసం పోలీసులు తీగ లాగితే జనసేన డొంక మొత్తం కదిలింది. పోలీసు విచారణలో వంట నూనెల లారీయే కాకుండా ఆకుల ప్రసాద్‌కు చెందిన నూకల లోడుతో ఉన్న మరో లారీ కూడా మాయమైందని తేలింది. ఆగంతకులు ఎత్తుకుపోయింది ఒక లారీ అనుకుని పోలీసులు విచారణ మొదలు పెడితే రెండో లారీ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు లారీల్లో సరకు విలువ రూ.కోటి పైమాటేనని పోలీసులు ప్రాథమికంగా లెక్క తేల్చారు.
ఎత్తుకుపోయింది జనసేన కార్యకర్తలే..
ఈ లారీలు ఎత్తుకుపోయింది అంతర్రాష్ట్ర దొంగలనుకునుకున్న పోలీసులు తొలుత ఆ దిశగా విచారణ ప్రారంభించారు. వాహనాలకున్న జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఆరు రోజుల పాటు కూపీ లాగి, చివరకు ఆ రెండు లారీలనూ పట్టుకున్నారు. తీరా, ఈ రెండు లారీలూ ఎత్తుకుపోయింది ఎనిమిది మంది జనసేన క్రియాశీలక కార్యకర్తలేనని తెలిసి నివ్వెరపోవడం పోలీసుల వంతు అయ్యింది. లారీలు ఎత్తుకుపోయిన దొంగల ముఠాలో ఉన్న పిఠాపురం పట్టణంలోని బొజ్జావారితోట, కోటగుమ్మం, లయన్స్ క్లబ్ ప్రాంతాలకు చెందిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి నాగ సతీష్, గంజి సురేష్, కాకినాడ రూరల్ మండలం పండూరుకు చెందిన నందిపాటి వీర సుబ్రహ్మణ్యాలను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
నేతల ఒత్తిళ్లు
పోలీసులకు పట్టుబడ్డ ఎనిమిది మందీ జనసేన ముఖ్య నేతలు వెంటేసుకుని తిరుగుతున్న క్రియాశీలక కార్యకర్తలేనని తేలడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జనసేనలో లారీలు ఎత్తుకుపోయే దొంగల ముఠా గుట్టు రట్టవడం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో పిఠాపురం పోలీసుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. నిందితులను తప్పించేందుకు ఆ పార్టీలో కాకినాడ, పిఠాపురానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరిని ముందే తప్పించేశారనే విమర్శలు వస్తున్నాయి. పరారీలో ఉన్న ఇద్దరినీ తప్పించాలని లేదంటే ప్రత్యామ్నాయమైనా ఆలోచించాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తూండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారని చెబుతున్నారు.
వారికి నేర చరిత్ర
లారీల చోరీల్లో పట్టుబడిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి నాగ సతీష్, గంజి సురేష్‌లకు నేర చరిత్ర ఉందని అరెస్టు సందర్భంగా పిఠాపురం సీఐ శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. ఈ ముగ్గురూ జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారని పిఠాపురం కోడై కూస్తోంది. అక్కడి జనసేన నాయకులతో కూడా వీరు సత్సంబంధాలు కలిగి ఉన్నారనే చెబుతున్నారు. అలాగే, పార్లమెంటు నాయకుడు, పవన్ కల్యాణ్ అన్న, ఎమ్మెల్సీ నాగబాబు వెంట కూడా ఉంటారు. నాలుగో నిందితుడైన నందిపాటి వీర సుబ్రహ్మణ్యం కూడా జనసేన పార్టీలో చురుకుగా ఉండటం గమనార్హం. నేర చరిత్ర ఉన్న విషయం తెలిసినా ఇంత కాలం వారిని పార్టీ కార్యక్రమాల్లో ఎలా ప్రోత్సహించారని ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల అండదండలు చూసుకునే వారు ఈ తరహా ‘ఘనకార్యాలకు’ బరి తెగించారని పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
పవన్ ఏమంటారో..
జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ చెప్పే మాటలకు.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తల తీరుకు అసలు పొంతనే కుదరడం లేదు. గత ఏడాది గొల్లప్రోలులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది, అవసరమైతే నేనే హోం మంత్రి అయి చక్కదిద్దాల్సి ఉంటుంది’ అని ఆవేశంగా చెప్పుకొచ్చారు. జనవరి 10న సంక్రాంతి సంబరాల సందర్భంగా జరిగిన సభలో ‘పిఠాపురంలో గంజాయి, రౌడీయిజం, దొంగతనాలు పెరిగిపోతున్నాయని స్థానికుల ద్వారా తెలిసింది. వీటిని నియంత్రించకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అంటూ పోలీసులకు పవన్ ఏకంగా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు తన వెన్నంటి తిరిగే జిల్లా ముఖ్య నేతల కనుసన్నల్లో ఉండే అనుచరులు లారీలు ఎత్తుకుపోయే దొంగల ముఠాగా పోలీసు దర్యాప్తులో వెల్లడి కావడంపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
·˘ ´ùÎçÜ$Ë$ ¡VýS ÌêW™ól..
కదిలిన జనసేన డొంక
·˘ ÌêÈÌS ^øÈÌZ ç³r$tºyìl¯]l BÆý‡$VýS$Æý‡$
·˘ ç³Æ>ÈÌZ E¯]l² Ð]l$Æø C§ýlªÇ°
తప్పించాలంటూ ఒత్తిళ్లు
·˘ A…§ýlÆý‡* B ´ëÈt
క్రియాశీలక కార్యకర్తలే..
·˘ MîSÌSMýS ¯ól™èlÌSMýS$ çܰ²íßæ™èl$Ìôæ..
·˘ °…¨™èl$ÌZÏ
ముగ్గురు నేరచరితులేనన్న సీఐ
·˘ MýSÌSMýSÌS… Æó‡ç³#™èl$¯]l²
దొంగల ముఠా బాగోతం

పిఠాపురంలో.. చోర సైనికులు?

పిఠాపురంలో.. చోర సైనికులు?

పిఠాపురంలో.. చోర సైనికులు?

పిఠాపురంలో.. చోర సైనికులు?