
ముగిసిన జాతీయ జూనియర్ మహిళా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న 15వ ఇండియన్ ఆయిల్ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీల విజేతగా జార్ఖండ్ జట్టు నిలిచింది. మంగళవారం నిర్వహించిన ఫైనల్స్‌లో జార్ఖండ్, హర్యానా జట్లు పోటీ పడగా 2–1 స్కోర్‌తో జార్ఖండ్ జట్టు విజయం సాధించి చాంపియన్ షిప్‌ను కై వసం చేసుకుంది. రన్నర్స్‌గా హర్యానా జట్టు నిలిచింది. మూడో స్థానానికి నిర్వహించిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పోటీపడగా ఉత్తరప్రదేశ్ 2–0 స్కోర్‌తో విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. క్రీడామైదానంలో సాయంత్రం నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎస్పీ బిందుమాధవ్ అతిథులుగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ నెల 1 నుంచి 12 వరకు నిర్వహించిన పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి 30 మందిని ప్రపంచ పోటీలకు ప్రాబబుల్స్‌గా ఎంపిక చేశారు. డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్, హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్, కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి థామస్ పీటర్, భవానీ శంకర్, టోర్ని కో–ఆర్డినేటర్ వి.రవిరాజు, సీపోర్టు సీఈఓ మురళీధర్ పాల్గొన్నారు.
విన్నర్స్ జార్ఖండ్
రన్నర్స్ హర్యానా
మూడోస్థానం ఉత్తరప్రదేశ్

ముగిసిన జాతీయ జూనియర్ మహిళా హాకీ పోటీలు