
సంపద తయారీ కేంద్రాలపై దృష్టి సారించాలి ˘
సామర్లకోట: గ్రామాల్లోని సంపద తయారీ కేంద్రాలపై ఎంపీడీఓలు దృష్టి సారించాలని జిల్లా పరిషత్తు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ అన్నారు. జిల్లాలోని 20 మంది ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు జి.మేడపాడు గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణలో వారు మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచీ తడి, పొడిచెత్త సేకరించి, వర్మి కంపోస్టు యూనిట్లకు తరలించాలన్నారు. తడి చెత్త నుంచి వర్మి కంపోస్టు తయారు చేసి, దాని వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పెద్దాపురం డీఎల్‌డీఓలు వాసుదేవరావు, శ్యామల, డీఎల్‌పీఓలు అన్నామణి, బాలమణి, సామర్లకోట ఎంపీడీఓ కె.హిమమహేశ్వరి, సర్పంచ్ పటాని దేవి తదితరులు పాల్గొన్నారు.
బాస్కెట్‌బాల్ పోటీల్లో
విజేతలుగా హైదరాబాద్ జట్లు
సామర్లకోట: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్వహించిన పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన బాస్కెట్‌బాల్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. రెండు రాష్ట్రాల నుంచి 140 జట్లు పోటీల్లో పాల్గొనగా 1,500 మంది క్రీడాకారులు హాజరైనట్టు శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో హైదరాబాద్‌కు చెందిన జట్లు విన్నర్స్, రన్నర్స్‌గా నిలిచారు. విజేతలకు డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు బహుమతులు అందజేశారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.చక్రవర్తి, విజయప్రకాష్ మాట్లాడారు.