గద్వాల క్రైం: కార్తీక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం గద్వాల ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీఎం శ్రవణ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కనీసం 30మంది ప్రయాణికులు గ్రూపుగా ఏర్పడి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటే బస్సు సర్వీసు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సూపర్ లగ్జరీ (నాన్ ఏసీ), డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులకు ఆయా కేటగిరీల్లో అద్దె ఉంటుందన్నారు. శబరిమల వెళ్లే భక్తులు, అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు సూపర్ లగ్జరీ బస్సులో 36 సీట్లకు గాను ఇద్దరు వంట మనుషులు, పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములు, అంటెండర్‌కు అనుమతి ఉంటుందన్నారు. అయా రాష్ట్రాల సరిహద్దు ట్యాక్స్‌లను బస్సు అద్దెకు తీసుకున్న వారే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 99592 26290, 73828 64291 నంబర్లను సంప్రదించాలని డీఎం కోరారు.
సహజ వ్యవసాయంతో అధిక దిగుబడులు
అలంపూర్: సహజ వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జగ్గు నాయక్ రైతులకు సూచించారు. గురువారం అలంపూర్ వ్యవసాయశాఖ కార్యాలయంలో ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు నేల ఆరోగ్యం, సహజ వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సేంద్రియ ఎరువులతో పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం సమతుల్య ఎరువులు, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడీఏ శివనాగిరెడ్డి, ఏఓ నాగార్జునరెడ్డి, ఏఈఓ అశ్విని పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.10,200
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 664 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 10,200, కనిష్టంగా రూ. 5,699, సరాసరి రూ. 8,170 ధరలు లభించాయి. అలాగే 1,318 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 3,609, కనిష్టంగా రూ. 2,529, సరాసరి రూ. 3,546 ధర పలికింది.
ఉత్సాహంగా
బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం అండర్–17 ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. సంగారెడ్డిలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెటాటీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌గౌడ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


